గ్యాస్ సరఫరా పునరుద్ధరించండి.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) బహిరంగ లేఖ రాశారు. వాణిజ్య, గృహ ఎల్పీజీ సిలిండర్ల కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటి కొరత ఆహార వ్యాపారాలను ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. హోటళ్లు, హాస్టళ్లు, చిన్న ఆహార వ్యాపారాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే వేలాది సంస్థలను మూసివేసే పరిస్థితి నెలకొందని వివరించారు. గ్యాస్ కొరత వల్ల కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని లేఖలో పేర్కొన్నారు. (Telangana News)