హైదరాబాద్ లో CNG కొరత.. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన కార్లు, ఆటోలు
దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న ఎల్పీజీ , సీఎన్జీ కొరత ఇపుడు వాహనదారులపై పడింది. సీఎన్జీతో నడిచే ఆటోలు, కార్లు ఎక్కడ చూసినా గ్యాస్ కోసం రోడ్లమీద క్యూ కట్టాయి.
ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్-ఆధారిత ప్లాట్‌ఫాంల ద్వారా LPG , CNG వాహనాలను నడిపే వేలాది మంది డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం నిరంతరాయంగా, అందుబాటు ధరలో ఇంధనం పొందడంపై ఆధారపడి ఉన్నారు. సరఫరాలో అంతరాయం కలిగితే, ఇంధన కేంద్రాల వద్ద దీర్ఘకాలిక క్యూలు ఏర్పడుతున్నాయి, తద్వారా తక్కువ ప్రయాణాలు జరుగుతున్నాయి , ఇప్పటికే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్న డ్రైవర్లకు ఆదాయ నష్టం కలుగుతుంది.
సీఎన్జీ కొరత వల్ల ఆటోలు, కార్లు వారి ఆదాయం మీద ఎఫెక్ట్ పడింది. రోజూ వారి ఆదాయం కోల్పోతున్నారు. దీంతో ఆదాయం తగ్గడంతో తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ జీవనోపాధిపైన పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.