జొన్న కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూస్తాం : కలెక్టర్ భవేశ్ మిశ్రా
భైంసా, వెలుగు: జొన్న పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని నిర్మల్కలెక్టర్భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్‌జిల్లా భైంసా పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్‌లో సబ్కలెక్టర్సంకేత్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
సరిపడా హమాలీలు, లారీల ద్వారా పంట కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పంట వివరాలను అధికారులను ఎమ్మెల్యే పటేల్అడిగి తెలుసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, తహసీల్దార్లు, సిబ్బంది.