Drishyam 3 OTT: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్-జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘దృశ్యం 3’ (Drishyam 3). గత నెల మే 21, 2026న థియేటర్లోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మిక్స్డ్ టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసిన దృశ్యం ఫ్రాంచైజీపై అంచనాలు పెంచేలా చేసింది. ఈ క్రమంలోనే సినీ ఫ్యాన్స్ దృశ్యం 4 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు.
థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 3’, ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'దృశ్యం 3' స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 18 లేదా జూన్ 25 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే, ఓటీటీ విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ లేదా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సినీ ఫ్యాన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడేందుకు జార్జ్‌కుట్టి కొత్త ప్లాన్‌తో ముందుకొస్తాడు. తన కథనే సినిమాగా తీసి జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇందుకోసం ఓ రైటర్తో కథ రాయించి, తానే నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాడు. దీంతో జార్జ్ కుట్టి లైఫ్‌స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె పెళ్లి విషయంలో కొత్త సమస్యలను ఎదుర్కొంటాడు. ఎన్ని సంబంధాలను చూసిన వెంట వెంటనే రిజెక్ట్ అవ్వడం సస్పెన్స్ కలిగిస్తాయి. ఎవరో కావాలనే సంబంధాలను చెడగొడుతున్నారని తెలుసుకున్న జార్జ్, ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కథలో ఉత్కంఠ పెరుగుతుంది.