South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

అమెరికా భవిష్యత్‌ అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ విరోధి కావొచ్చు: నెతన్యాహు

అమెరికా భవిష్యత్‌ అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ విరోధి కావొచ్చు: నెతన్యాహు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఇజ్రాయెల్‌కు విరోధి కావొచ్చని ఆ దేశ ప్రధాని నెతన్యాహు (Netanyahu) పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌ (India), లాటిన్‌ అమెరికా వంటి బలమైన దేశాలతో పొత్తు పెట్టుకోవాలని తమ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘మరో రెండేళ్లలో ఇజ్రాయెల్‌ పట్ల శత్రుభావంతో ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా (US president) బాధ్యతలు చేపట్టవచ్చు. వారు పురుషుడు లేదా మహిళ ఎవరైనా కావచ్చు. మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు? (అధికారులను ఉద్దేశించి), అగ్రరాజ్యంతో సంబంధాలు ఎలా నిర్వహిస్తారు?అమెరికా విధానంలో సంభవించే పెద్ద మార్పునకు సిద్ధమవుతూనే.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఇజ్రాయెల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. వచ్చే రెండేళ్లలోనే అమెరికా సాయంతో చేయగలిగినదంతా చేయాలి’’

మీ అదృష్టాన్ని ఇంకోసారి పరీక్షించుకోవాలనుకుంటున్నారా..?: అబ్బాస్‌ అరాగ్చీ
‘‘అదే సమయంలో భవిష్యత్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని దేశాలతో సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కూటములను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. భారత్‌ చిన్న దేశమేమీ కాదు. అలాగే లాటిన్‌ అమెరికా, బ్రెజిల్‌లలో త్వరలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. మనం మన కూటముల సంఖ్యను విస్తరించుకోవాలి. మన విలువ పెంచే సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్‌ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్నికల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన గాడి ఐసెన్‌కోట్ తప్పుబట్టారు. ఇతర దేశాల పేరు చెప్పి నెతన్యాహు ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 9 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
⬅ Back
➕ Post Ad
To Ads ➡