South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఇక న్యూజిలాండ్‌ సవాల్‌.. నేటి నుంచే టీ20 సిరీస్‌ మొదలు

ఇక న్యూజిలాండ్‌ సవాల్‌.. నేటి నుంచే టీ20 సిరీస్‌ మొదలు

క్రిస్ట్‌చర్చ్‌: స్వదేశంలో వరుస సిరీస్‌ విజయాలతో దూకుడుమీదున్న భారత టీ20 జట్టు మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. మూడు ఫార్మాట్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. గురువారం నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్రిస్ట్‌చర్చ్‌లో జరుగబోయే తొలి పోరులో ఆతిథ్య జట్టును ఢీకొననుంది. సొంతగడ్డపై బెబ్బులిలా గర్జిస్తున్నప్పటికీ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాక వెళ్లిన ఐర్లాండ్‌, యూకే పర్యటనల్లో జట్టు సిరీస్‌ ఓటములను మూటగట్టుకుని తీవ్ర విమర్శల పాలైంది.

ఆ తర్వాత సొంతగడ్డపై, ఇటీవల ఆసియా క్రీడల్లో మెరిసినప్పటికీ న్యూజిలాండ్‌ టూర్‌ అయ్యర్‌ అండ్‌ కో.కు కత్తిమీద సవాల్‌ వంటిదే. ఉపఖండంతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉండే కివీస్‌ వాతావరణ పరిస్థితుల్లో ఆడిన అనుభవం కూడా ప్రస్తుతం ఉన్న జట్టులో చాలామందికి లేదు. కెప్టెన్‌ శ్రేయస్‌, ఇషాన్‌, సంజూ, దూబే మినహా మిగిలిన బ్యాటర్లకు కివీస్‌ పిచ్‌లు కొత్తే. అదీగాక 2022 తర్వాత భారత్‌.. ఇక్కడికి రాలేదు. ఈ నేపథ్యంలో కివీస్‌ బౌలింగ్‌ దాడిని అయ్యర్‌ సేన ఏ మేరకు ఎదుర్కుంటుందున్నది ఆసక్తికరం.

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే స్వదేశంలో వెస్టిండీస్‌ బ్యాటర్లతో వీరబాదుడు బాదించుకున్న భారత బౌలర్లు కివీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. బుమ్రా గైర్హాజరీలో భువనేశ్వర్‌ అనుభవం జట్టుకు, తన తోటి బౌలర్లకు ఏ మేరకు ఉపయోపడుతుందన్నది త్వరలో తేలనుంది. మరోవైపు తమకు అనుకూలించే పరిస్థితుల్లో మిచెల్‌ శాంట్నర్‌ సేనను అడ్డుకోవడం భారత బౌలర్లకు శక్తికి మించిన పనే. 2027లో జరుగబోయే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌నకు సహ ఆతిథ్య దేశంగా ఉన్న న్యూజిలాండ్‌లో పరిస్థితులను అవగతం చేసుకోవడానికి అయ్యర్‌ సేనకు ఈ సిరీస్‌ ఒక సువర్ణావకాశం.

📍 Chennai
📰 Smacy News
🕒 7 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
⬅ Back
➕ Post Ad
To Ads ➡