21 మంది భారతీయులున్న నౌకపై దాడి
టెహ్రాన్ : హొర్ముజ్ జలసంధిలో 21 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న కువైట్ జెండా గల ఆయిల్ ట్యాంకర్ ఎం/టీ అల్ దాస్మాపై క్షిపణి దాడి జరిగింది. ఒమన్ తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 21 మంది భారతీయ సిబ్బందితో పాటు మిగిలిన వాళ్లు కూడా సురక్షితంగా బయటపడ్డట్టు బుధవారం ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.