South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

400మీట‌ర్ల స్ప్రింట్‌లో వ‌ర‌ల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వ‌ర్ణ ప‌త‌కం

400మీట‌ర్ల స్ప్రింట్‌లో వ‌ర‌ల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వ‌ర్ణ ప‌త‌కం

న‌గోయా: ఏషియ‌న్ పారా గేమ్స్‌లో ఇండియా ఖాతాలో ప‌త‌కాలు వ‌చ్చి చేరుతున్నాయి. ఇవాళ గేమ్స్ 5వ రోజు స్ప్రింట‌ర్ సందీప్ కుమార్‌(Sandeep Kumar).. స్వ‌ర్ణం గెలిచాడు. 400 మీట‌ర్ల టీ44 ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ కొట్టాడు. అత‌ను ల‌క్ష్యాన్ని 52.28 సెక‌న్ల‌లో అందుకున్నాడు. సందీప్ త‌న ప‌ర్ఫార్మెన్స్‌తో ప్ర‌పంచ రికార్డును క్రియేట్ చేశాడు. ఇవాళ జ‌రిగిన ఫైన‌ల్లో సౌదీ అరేబియాకు చెందిన నూర్ అల్స‌నా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మ‌రో భార‌త అథ్లెట్ అజ‌య్ కుమార్ కూడా ఇదే ఈవెంట్‌లో రాణించాడు. అత‌ను ల‌క్ష్యాన్ని 53.61 సెక‌న్ల‌లో అందుకుని కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. అజ‌య్ కుమార్ కూడా ఏషియ‌న్ గేమ్స్ రికార్డును స్థాపించాడు. 400 మీట‌ర్ల స్ప్రింట్‌లో రెండు మెడ‌ల్స్ రావ‌డంతో.. ప్ర‌స్తుత పారా గేమ్స్‌లో భార‌త బృందం సాధించిన ప‌త‌కాల సంఖ్య వంద దాటింది.

📍 Chennai
📰 Smacy News
🕒 6 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
⬅ Back
➕ Post Ad
To Ads ➡