South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

వాళ్లకు మనసులో మాటిచ్చా.. గెలిపించా: తిలక్‌వర్మ

వాళ్లకు మనసులో మాటిచ్చా.. గెలిపించా: తిలక్‌వర్మ

ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమ్‌ ఇండియా కష్టాల్లో పడిన సమయంలో జట్టు ఎలాగైన గెలిపించాలన్న లక్ష్యంతో తిలక్‌ వర్మ (Tilak Varma) బరిలోకి దిగాడు. ఈ విషయాన్ని నితీశ్‌ రెడ్డితో కలిసి బీసీసీఐ టీవీతో మాట్లాడుతు ఆయనే వెల్లడించారు. పిచ్‌ సహకరించక పోవడంతో తొలి టీ20 వలే భారీ సిక్సర్లు సాధ్యం కాకపోవచ్చని తనకు వెంటనే అర్థమైపోయిందన్నాడు.

‘‘వికెట్ సవాళ్లు విసురుతోందని అర్థమైపోయింది. ముఖ్యంగా మైదానం కూడా పెద్దది. మరోవైప్‌ స్లోపిచ్‌. కానీ, బౌన్సర్లు మాత్రం వేగంగా మీదకు వస్తున్నాయి. దీంతో అనుకున్నప్పుడల్లా సిక్సర్లు కొట్టడం సాధ్యం కాదని తేలిపోయింది.

ఆ స్థానంలో వైభవ్‌ ఇబ్బంది పడ్డాడు: అశ్విన్‌

నిజాయతీగా చెబుతున్నాను.. తొలి మ్యాచ్‌లో చాలా సులభంగా సిక్సర్లు బాదాము. కానీ, ఈ పిచ్‌పై మా ఫిట్‌నెస్‌ స్థాయి ఏమిటో చూపించాలని నిర్ణయించుకొన్నాం. సింగల్స్‌, డబుల్స్‌తో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాలని భావించాము.

నమన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో భారీ షాట్లకు యత్నించాలని భావించాను. కానీ, మనసులో మాత్రం మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళతానని గౌతమ్‌ సర్‌, కొటక్‌ సర్‌కు మాటిచ్చాను’’ అని తిలక్‌ వర్మ (Tilak Varma) పేర్కొన్నాడు.

వాస్తవానికి 11వ ఓవర్‌ చివరికి నమన్‌, తిలక్‌ చెరో పరుగుతో క్రీజులో ఉన్నారు. కానీ, మూడు ఓవర్ల తర్వాత నమన్‌ 30 పరుగులు, తిలక్‌ ఆరు పరుగులకు చేరుకొన్నారు. ఆ తర్వాత తిలక్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయం అందించాడు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 4 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
⬅ Back
➕ Post Ad
To Ads ➡