South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

Israel Elections | జెరూసలెం:ఇజ్రాయెల్‌ తదుపరి ప్రధానమంత్రి ఎవరో ఈ నెల 27న జరిగే ఎన్నికలతో తేలనుంది. ప్రస్తుత ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అధికారంలో కొనసాగుతారా? లేక గాడి ఐసెన్‌కోట్‌, నఫ్తాలి బెన్నెట్‌, యూయిర్‌ లాపిడ్‌ లేదా మన్సూర్‌ అబ్బాస్‌లలో ఎవరైనా పగ్గాలు చేపడుతారా? అన్నది ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. 120 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 7 దాడి సమయంలో భద్రతా వైఫల్యాలు, పెరుగుతున్న జీవన వ్యయం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌ ప్రతిష్ఠ వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమిలో జాతీయ భద్రతా మంత్రి ఇతమార్‌ బెన్‌-గ్విర్‌కు చెందిన ఓట్జా యెహుదిత్‌ వంటి అతివాద పార్టీలతోపాటు, షాప్‌, యునైటెడ్‌ తోరా జడాయిజం వంటి అల్ట్రా ఆర్థడాక్స్‌ పార్టీలు ఉన్నాయి.

యషార్‌ పార్టీ నాయకుడు గాడి ఐసెన్‌కోట్‌, బేయాహాద్‌ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్‌ ప్రధాని పదవికి పోటీపడుతున్నారు. సర్వేల ప్రకారం నెతన్యాహుతో ఐసెన్‌కోట్‌ పోటీ గట్టిగా ఉండగా, కొన్ని సర్వేల్లో ఆయన ముందంజలో ఉన్నట్టు వెల్లడైంది. సెప్టెంబర్‌ 8న వెల్లడైన పాలీ మార్కెట్‌ అంచనాల ప్రకారం.. ఐసెన్‌కోట్‌కు 51 శాతం, నెతన్యాహుకు 28 శాతం అవకాశాలున్నాయి. ది టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ ప్రకారం కూటమికి 54 స్థానాలు లభించే అవకాశం ఉన్నది. నెతన్యాహు నేతృత్వంలోని మితవాద, అల్ట్రా ఆర్థడాక్స్‌ పార్టీల కూటమికి 48-49 స్థానాలు రావొచ్చని అంచనా. 120 మంది సభ్యులున్న నెస్సెట్‌లో 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ లెక్కన ఏ కూటమికీ సొంతంగా మెజారిటీ సాధించే అవకాశాలు లేవు. అరబ్‌ ప్రాబల్యం ఉన్న పార్టీలు సుమారు 13 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా. దీంతో ఈ పార్టీల మద్దతు కీలకం కానున్నది.

📍 Chennai
📰 Smacy News
🕒 3 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
కాంగ్రెస్‌కు గుండుసున్నా
కాంగ్రెస్‌కు గుండుసున్నా
⬅ Back
➕ Post Ad
To Ads ➡