పడిక్కల్, సుదర్శన్ పోరాటం
లింకన్ : న్యూజిలాండ్-ఏతో తొలి అనధికారిక టెస్టులో భారత్-ఏ పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడి ప్రత్యర్థికి భారీ ఆధిక్యం సమర్పించుకున్న జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిస్తోంది. రెండో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), కేఎల్ రాహుల్ (4)మళ్లీ విఫలమైనా… దేవ్‌దత్ పడిక్కల్ (89 బంతుల్లో 56 బ్యాటింగ్), సాయి సుదర్శన్ (104 బంతుల్లో 39 బ్యాటింగ్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు.
కివీస్ స్కోరుకు భారత్ ఇంకా 98 పరుగుల వెనుకంజలోనే ఉంది. అంతకుముందు 135/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్-ఏ జట్టు 89.3 ఓవర్లలో 317 స్కోరుకు ఆలౌటై 204 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. కెప్టెన్ రైస్ మారియు (76) టాప్ స్కోరర్‌గా నిలవగా, డీన్ ఫోక్స్‌క్రాఫ్ట్ (51), క్రిస్టియన్ క్లార్క్ (42) రాణించారు. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3/52), ఆకిబ్ నబీ (3/69) చెరో 3 వికెట్లు పడగొట్టారు.