South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

విరాట్ నిర్ణయంతో.. వాండరర్స్‌లో ఎవరైనా చచ్చిపోతారనుకున్నా: డుప్లెసిస్

విరాట్ నిర్ణయంతో.. వాండరర్స్‌లో ఎవరైనా చచ్చిపోతారనుకున్నా: డుప్లెసిస్

Virat - Du Plessis| ఇంటర్నెట్ డెస్క్‌: విరాట్ కోహ్లీ (Virat As Captain) టెస్టు సారథిగా ఉన్నప్పుడు భారత్‌ గొప్ప విజయాలను నమోదు చేసింది. విదేశీ గడ్డపై గెలుపు రుచి చూసింది. మొత్తం 68 టెస్టుల్లో 40 మ్యాచుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. అయితే, దక్షిణాఫ్రికాతో వాండరర్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ తనకు ఇంకా గుర్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీ భారత ప్లేయర్లు చేసిన సూచనలు తనను ఆందోళనకు గురిచేశాయని తెలిపాడు.

‘‘అది వాండరర్స్ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య టెస్టు మ్యాచ్‌. పిచ్‌ చాలా ప్రమాదకరంగా మారింది. అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాటర్లకు సవాల్ విసిరింది. మా బ్యాటర్ డీన్‌ ఎల్గర్ తలకు గాయమైంది. ‘ఇవాళ ఎవరైనా చనిపోతారేమో’ననిపించింది. ఆ పిచ్‌ అంత భయంకరంగా ఉంది. మెడ, భుజం.. ఎక్కడపడితే అక్కడ బంతి తాకుతోంది. పిచ్‌పై పేస్‌ ఎక్కువగా ఉంది. ఆ మ్యాచ్‌లో మా కంటే టీమ్‌ఇండియా ఆధిక్యంలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి కెప్టెనైనా ‘ఆటను కొనసాగాలి’ అని కోరుకుంటారు. బలహీనంగా ఉన్న జట్టు సారథి అయితే ‘మ్యాచ్‌ను ఆపేయాలని’ భావిస్తాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సహచరులకు ఒకటే సందేశం ఇచ్చాడు. గ్లౌవ్స్‌, చేయి, తల, మెడ.. ఎక్కడ బంతి తాకినా సరే ఎలాంటి రియాక్షన్ ఇవ్వొద్దని చెప్పాడు. లేకపోతే ఆటను రద్దు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది’’ అని తెలిపాడు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 2 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
⬅ Back
➕ Post Ad
To Ads ➡