South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Donald Trump | వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌'(ఏఐ) అనే పదాన్ని అధికారిక పత్రాల్లో నిషేధిస్తామని ప్రకటించారు. దానికి బదులుగా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌'(ఎస్‌ఐ) అనే పదాన్ని ఉపయోగించాలని సూచించారు.

‘ఆర్టిఫిషియల్‌’ అనే పదం సాంకేతిక సామర్థ్యాలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేరును మార్చాలన్న ప్రతిపాదనను ట్రంప్‌ గత నెలలోనే తెరపైకి తెచ్చారు. అమెరికా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తమ అధికారిక కార్యకలాపాల్లో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’, ‘ఏఐ’ పదాలకు బదులుగా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’, ‘ఎస్‌ఐ’ పదాలను ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

📍 Chennai
📰 Smacy News
🕒 2 days ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
⬅ Back
➕ Post Ad
To Ads ➡