TTD | శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ ఘటన..బాధ్యులపై కేసు నమోదు
తిరుమల : శ్రీవారి ఆలయం ఎదుట నృత్యం చేస్తూ రీల్స్ ( Reels) చిత్రీకరించిన ఘటనపై టీటీడీ ( TTD) అధికారులు చర్యలు తీసుకున్నారు. సదరు వ్యక్తులపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఆలయ పరిసరాలు ,మాడ వీధుల్లో రీల్స్, వీడియోల చిత్రీకరణ పూర్తిగా నిషేధమని, ఆలయ పవిత్రతకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తులు కూడా ఆలయ పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు .