బీర్ల కంపెనీలకు నీళ్లు.. రైతులకు కన్నీళ్లా..! 12 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): పంటలకు నీరందించాలని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. పట్టించుకోని రేవంత్ సర్కార్ బీర్ల కంపెనీల కు నీళ్లివ్వడం దుర్మార్గమని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎ ర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింగూరు ప్రాజెక్టు కింద 12లక్షల ఎకరా ల్లో పంటలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ తుగ్లక్ చర్యలతో నిండుగా ఉన్న సింగూ రును ఖాళీ చేసి ఏడారిగా మార్చారని మండిపడ్డారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ప్రవీణ్‌కుమార్, గోసుల శ్రీనివాస్, పార్టీ నేతలు అభిలాష్ రంగినేని, గౌతంప్రసాద్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరువు ముప్పును ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం.. సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడికి దిగుతూ కాలక్షేపం చేస్తున్నదని దుయ్యబట్టారు.
ఆంధ్రాలో జలసిరులతో చంద్రబాబు పంటలు పండించుకుంటుంటే.. ఇక్కడ రేవంత్‌రెడ్డి క్రాప్‌హాలిడే ప్రకటించి గురుదక్షిణ చెల్లించుకున్నారని ఆరోపించారు. ఎంపీ చామల, ఎమ్మెల్సీలు బల్మూరి, అద్దంకి దయాకర్ చిల్లర మాటలు మాట్లాడటం కాదని, దమ్ముంటే ఎండిన పంటపొలాల వద్దకు వెళ్లి రైతులను పరామర్శించాలని సవాల్ విసిరారు. ‘సీఎంవో రాసిచ్చే స్రిప్టులు చదవడానికి మీరు ప్రజాప్రతినిధులా? లేక రేవంత్ ప్రైవేట్ భజనపరులా? అని నిలదీశారు. బ్లాక్ మారెట్‌ను అరికట్టలేక బియ్యం ధరను కిలో రూ.90కి, నూనె రూ.220కు పెరిగాయని ఆరోపించారు.