South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఎక్కడైనా రెబల్స్‌ ఉంటే సస్పెండ్‌ చేయండి: సీఎం చంద్రబాబు

ఎక్కడైనా రెబల్స్‌ ఉంటే సస్పెండ్‌ చేయండి: సీఎం చంద్రబాబు

అమరావతి: మంత్రివర్గంలో అజెండా అంశాలు ముగిశాక స్థానిక ఎన్నికలపై మంత్రులతో సీఎం చంద్రబాబు (Chandrababu) చర్చించారు. మూడు పార్టీలు ఖరారు చేసిన కూటమి అభ్యర్థే ఫైనల్‌ అని సీఎం మరోసారి స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు కృషి చేయాలన్నారు. కూటమి ఐక్యతపై ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌ ప్రజల్లోకి బాగా వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. మూడు పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఐక్యంగా పనిచేద్దామన్నారు.

అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో మంచి సానుకూలత ఉందని చంద్రబాబు అన్నారు. చిన్న సమస్యలను కూడా ఎంతో శ్రద్ధతో పరిష్కరిస్తున్నామని పవన్‌ చెప్పారు. పార్టీ తరఫున ఇంకా ఎక్కడైనా రెబల్స్‌ ఉంటే సస్పెండ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఎన్నికలు పూర్తయ్యాక పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని.. ఆ వెంటనే సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయన్నారు. ఆ తర్వాత మొత్తం పాలనపై దృష్టి పెడదామన్నారు. ఎక్కడైనా వివాదాలుంటే వెంటనే పరిష్కరించాలని మంత్రులకు సీఎం సూచించారు.

📍 Guntur
📰 Eenadu Telugu
🕒 10 hrs ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
⬅ Back
➕ Post Ad
To Ads ➡