South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్

భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ (Arshdeep Singh) ఓ భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో ఉన్నాడు. ఈ పేసర్ మరో వికెట్‌ పడగొడితే అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరగనున్న నాలుగో టీ20లో అతడు ఈ ఫీట్ అందుకునే ఛాన్స్ ఉంది. 2022లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. ఇప్పటివరకు 102 మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు పడగొట్టాడు. స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (100 మ్యాచ్‌లు.. 126 వికెట్లు) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, న్యూజిలాండ్‌ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ (Mitchell Santner) కూడా అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మైలురాయికి ఒక వికెట్‌ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు పడగొట్టిన శాంట్నర్.. భారత్‌తో నాలుగో టీ20లో ఒక వికెట్ తీస్తే కివీస్‌ తరఫున 150 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలుస్తాడు. న్యూజిలాండ్ బౌలర్లు ఇష్‌ సోధి (165), టిమ్ సౌథి (164) ఇప్పటికే ఈ ఫీట్ సాధించారు.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 9 hrs ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
Today's Motivation
Today's Motivation
⬅ Back
➕ Post Ad
To Ads ➡