South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

రూ. 26 కోట్ల సైబర్‌ మోసంలో ఈడీ సోదాలు

రూ. 26 కోట్ల సైబర్‌ మోసంలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (నమస్తే తెలంగాణ) : అధిక లాభాల ఆశ చూపి సైబర్‌ పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసి రూ.26 కోట్లకు పైగా కాజేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కొరడా ఝళిపించింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ నెల 28న ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లంరాజు సత్యనారాయణమూర్తికి సంబంధించిన నివాస, వ్యాపార ప్రాంగణాల్లో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ ఏ)-2002 కింద తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్‌ ఆధారాలతో పాటు రూ.6.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నది. నిందితుడికి సంబంధమున్న 11 బ్యాంకు ఖాతాల్లోని రూ.14 లక్షల నగదును స్తంభింపజేసింది.

అంతేకాకుండా సుమారు రూ.5 కోట్ల విలువైన ప్లాట్లు, విల్లా ఆస్తులను గుర్తించింది. కేరళలోని ఎర్నాకుళం సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నిమేష్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితులు టెలిఫోన్‌ కాల్స్‌, టెలిగ్రామ్‌ యాప్‌లో చాట్‌ సందేశాల ద్వారా ఆయనను సంప్రదించారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితుడు విడతలవారీగా వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.24,76,21,042 బదిలీ చేశాడు. అయితే హామీ ఇచ్చిన లాభాలను, చివరకు అసలు పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వకుండా నిందితులు మోసానికి పాల్పడ్డారు. 2023 మే 23 నుంచి 2024 మే 27 మధ్య కాలంలో బాధితుడి నుంచి మొత్తం రూ.26,02,89,261 కాజేసినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

📍 Guntur
📰 Smacy News
🕒 15 hrs ago

Related News

మనీషా పసిడి పట్టు.. వరల్డ్‌ చాంపియన్‌ గెలిచిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర
మనీషా పసిడి పట్టు.. వరల్డ్‌ చాంపియన్‌ గెలిచిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర
Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
⬅ Back
➕ Post Ad
To Ads ➡