Ayatollah Ali Khamenei: ట్రంప్ బెదిరింపులు.. 37 ఏళ్ల సంప్రదాయానికి ఖమేనీ బ్రేక్..!
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్‌కు చేరువలో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) 37 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 8న ఎయిర్‌ఫోర్స్ కమాండర్లతో ఏటా ఆయన భేటీ అవుతుంటారు. ఈసారి ఆ సమావేశంలో ఆయన పాల్గొనలేదని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 1989లో సుప్రీంలీడర్‌గా బాధ్యతలు అందుకున్న దగ్గరినుంచి చివరకు కరోనా సమయంలో కూడా ఈ వార్షిక సమావేశాన్ని ఆయన మిస్ చేయకపోవడం గమనార్హం.