... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఈ విధానం భారత్‌కు అనుకూలంగా ఉందన్నది అవాస్తవం: టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌

ఈ విధానం భారత్‌కు అనుకూలంగా ఉందన్నది అవాస్తవం: టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 వరల్డ్‌కప్‌ (ICC Mens T20 World Cup) 2026లో గ్రూప్‌ స్టేజి మ్యాచ్‌లు ముగిసి, సూపర్‌-8 ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా ఐసీసీ (ICC) విభజించింది. గ్రూప్‌-1లో భారత్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే జట్లు కొలువుదీరాయి. గ్రూప్‌-2లో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంక ఉన్నాయి. అయితే ప్రి సీడింగ్‌పైనా సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. టీమ్‌ఇండియాకు ఇది అనుకూలంగా ఉందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తన ఆగ్రహం వ్యక్తంచేశాడు. నిజానికి ప్రస్తుత జట్ల విభజన వల్ల టీమ్ఇండియాకే ఎక్కువ కష్టం అని అతడు అన్నాడు.

‘ఈ మెగా టోర్నీకి రెండు దేశాలు (భారత్‌, శ్రీలంక) ఆతిథ్యమిస్తున్నాయి. కాబట్టి భారత్‌ తన మ్యాచులన్నీ స్వదేశంలోనే ఆడాల్సిఉంది. అలాగే శ్రీలంక, పాకిస్థాన్ తమ మ్యాచులు శ్రీలంకలోనే ఆడాల్సి ఉంది. అందుకే శ్రీలంక, పాకిస్థాన్‌ను ఒకే గ్రూప్‌లో ఉంచాల్సివచ్చింది. అప్పుడు కచ్చితంగా భారత్‌ మరో గ్రూప్‌లోనే ఉండాలి. ఇలా లేకుంటే టోర్నీ ఎలా ముందుకుసాగుతుంది?’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

Source : Smacy News

1 hour ago

Home Flash News