Sanju Samson Mentor: సంజు శాంసన్ విజృంభణకు కారణం ఎవరో తెలుసా?.. అస్సలు ఊహించలేరు!
Sanju Samson Mentor: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ గత రెండేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లోమూడు సెంచరీలు చేయడం.. అందులో వరుసగా రెండు శతకాలు చేయడం అతడి హిట్టింగ్‌కు నిదర్శనం. అయితే టీ20 ప్రపంచకప్ 2026కు ముందు జరిగిన న్యూజీలాండ్ సిరీస్‌లో విఫలమయ్యాడు. దాంతో మెగా టోర్నీలో ఎక్కువగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలు మాత్రం సంజు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ముఖ్యంగా సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 రన్స్ చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోచించాడు. సంజు విజృంభణకు కారణం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వంలో సంజు శాంసన్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. దాంతో మెగా టోర్నీలో బాగా ఆడుతున్నాడు. సంజు ఆటలో భారీ మార్పుకు యువీనే కారణం. యువరాజ్ మార్గదర్శకత్వం, టెక్నిక్ సూచనలు సంజు బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెగా టోర్నీలో సంజు చేసిన ప్రదర్శనలు చూస్తే.. అతని ఫామ్ ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. నమీబియాపై కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభం ఇచ్చాడు. జింబాంబ్వేపై 15 బంతుల్లో 26 పరుగులు చేసి మరోసారి దూకుడు చూపించాడు. అసలైన మాస్టర్‌పీస్ ఇన్నింగ్స్ మాత్రం వెస్టిండీస్‌పై ఆడాడు. ఆ మ్యాచ్‌లో సంజు 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
సంజు శాంసన్ ఇన్నింగ్స్‌లలో కనిపిస్తున్న స్థిరత్వం, షాట్ సెలక్షన్, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడే తీరు.. అన్ని అతడి మానసిక ధైర్యాన్ని చూపిస్తున్నాయి. యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజంతో సాధన చేయడం వల్ల అతనికి ఆత్మవిశ్వాసం పెరిగిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా పవర్ హిట్టింగ్‌తో పాటు పరిస్థితికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ నిర్మించే నైపుణ్యం సంజులో మెరుగుపడింది. సరైన గురువు దొరికితే ఆటగాడి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో సంజు ఉదాహరణగా నిలిచాడు. అతని ప్రస్తుత ఫామ్ ఇలానే కొనసాగితే టీమిండియాకు కీలక మ్యాచ్‌ల్లో అతను ట్రంప్ కార్డ్‌గా మారడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు.