Dhurandhar 2 Trailer: కరాచీ క్రైమ్ సిండికేట్‌లోకి హమ్జా.. 'ధురంధర్: ది రివెంజ్' ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది!
Dhurandhar 2 Trailer: కరాచీ నేపథ్యంలో యాక్షన్ రివెంజ్ డ్రామా.. హమ్జా ఎంట్రీతో ‘ధురంధర్ 2’పై భారీ అంచనాలు పెరిగిన ట్రైలర్!
Dhurandhar 2 Trailer: బాలీవుడ్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చిన చిత్రం ధురంధర్. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని బాలీవుడ్ కు 1000 కోట్ల కలెక్షన్స్ దాటిన చిత్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు ధురంధర్ టీం. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక భారీ సీక్వెల్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అది మరేదో కాదు.. బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు సృష్టించిన 'ధురంధర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) గురించే. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
హోలీ సందర్భంగా మార్చి 3న ట్రైలర్ వస్తుందని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మార్చి 6, 2026న అధికారికంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. పండుగ రద్దీ, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు మేకర్స్ నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ట్రైలర్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా సుమారు 235 నిమిషాల (3 గంటల 55 నిమిషాలు) నిడివితో ఉండబోతోందని సమాచారం. హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన చిత్రాలలో ఒకటిగా ఇది నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే.. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ వంటి అగ్ర నటులు ఈ స్పై థ్రిల్లర్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరాచీ క్రైమ్ సిండికేట్‌లోకి హమ్జా ఎలా జాయిన్ అయ్యాడనే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ భాగంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మిస్తున్నారు.