United Nations On Iran crisis: ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. బాంబు దాడులు, మిస్సైల్స్ ప్రయోగిస్తున్నా ఇరాన్‌పై దాడిని ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోలేకపోతోంది.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ దేశంలోని పలు నగరాలపై వైమానిక దాడులు చేయడం, ఆపై ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్షీణిస్తున్న పరిస్థితుల మధ్య, ఐక్యరాజ్యసమితి (United Nations) ఇరాన్‌పై దాడులను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఐక్యరాజ్యసమితిని స్థాపించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి, సంస్థ కార్యకలాపాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఐక్యరాజ్యసమితి ఎందుకు మౌనంగా ఉంది?
ఇటీవల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దాడులను అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా అభివర్ణించారు. అయితే కేవలం ప్రకటన జారీ చేయడం అనేది పటిష్టమైన చర్య తీసుకోవడం కాదు. ఐక్యరాజ్యసమితికి ఎటువంటి స్వతంత్ర సైనిక దళం లేదు. ఏదైనా కీలకమైన చర్య తీసుకోవాలంటే అది దాని అత్యంత శక్తివంతమైన విభాగమైన 'ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి' (UNSC) ద్వారానే జరగాలి.