ఇంద్రకీలాద్రి కుంభాభిషేక మహోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం
అమరావతి: సీఎం చంద్రబాబును దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ కలిశారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్‌నూ పాలక మండలి ఆహ్వానించింది.