... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
T20 World Cup: టీమిండియాకు ఐసీసీ షాక్.. సంజు శాంసన్ సెమీస్ ఆడ‌కుండా నిషేధం?

T20 World Cup: టీమిండియాకు ఐసీసీ షాక్.. సంజు శాంసన్ సెమీస్ ఆడ‌కుండా నిషేధం?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కి ముందు భారత జట్టుకు ఊహించని బిగ్ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 97 పరుగులతో చెలరేగి ఆడిన సంజు శాంసన్ పై ఐసీసీ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అతడు సెమీస్ ఆడకుండా నిషేధం విధించనున్నట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ పైన గెలిచిన తర్వాత సంజు సెలబ్రేషన్స్ తీవ్ర వివాదంగా మారాయి. బ్యాట్ పడేటం, హెల్మెట్ నేలకేసి కొట్టాడం ఐసీసీ రూల్స్ కి వ్యతిరేకం అని చెబుతున్నారు. దీంతో అతనిపై ఒక మ్యాచ్ వేటు పడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలోకథనాలు ప్రసారం చేస్తున్నారు. అదే జరిగితే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్ కు సంజు శాంసన్ దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య మార్చి 5వ తేదీన రెండవ సెమీఫైనల్ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో సంజు ఆడడంపై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతుంది. వెస్టిండీస్ గెలిచిన తర్వాత శాంసన్ మతాలను రెచ్చగొట్టడం, హెల్మెట్ నేలకేసి కొట్టడం, అసభ్యకరంగా తన చేతిని చూపించడం లాంటివి చేశాడు. ఇవన్నీ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇవన్నీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. రూల్స్ ప్రకారం అతనిపై వేటు వేసే ఛాన్సులు అధికంగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇలాంటి పనులు చేస్తే లెవెల్ వన్ తప్పిదంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పరిగణిస్తుంది. దీనివల్ల మ్యాచ్ ఫీజులో కోత, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశం మాత్రమే ఉందని తెలుస్తుంది. గడిచిన 12 నెలల్లో మొత్తంగా 4 డీమెరిట్ పాయింట్లు వస్తేనే సెమీ ఫైనల్ ఆడకుండా సంజు శాంసన్ పై వేటు వేసే అవకాశం ఉంది. కానీ గతంలో సంజు శాంసన్ ఇలాంటి తప్పిదాలు ఎక్కడ కూడా చేయలేదు.. అంటే అతనిపై ఒక్క మ్యాచ్ నిషేధం విధించే అవకాశం లేదని క్లియర్ గా తెలుస్తుంది. మతాలను రెచ్చగొట్టడం, అసభ్యకరంగా తన చేతిని చూపించడంతో సంజుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై ఇవాళ సాయంత్రంలోపు ఐసీసీ తన నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. శాంసన్ పై వేటు పడితే, భారత జట్టుకు భారీ షాక్ తగిలినట్లే.. అతడి స్థానంలో తుది జట్టులోకి రింకూ సింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Source : V6 News

1 hour ago

Home Flash News