... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు.. వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలకు కారణం ఏంటంటే..?

స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు.. వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలకు కారణం ఏంటంటే..?

ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా మూడు రోజుల నుంచి ప్రపంచ మార్కెట్లతో పాటుగా భారతీయ ఈక్విటీలు కూడా నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల నష్టాలతో ఇన్వెస్టర్లకు దాదాపు రూ.20 లక్షల కోట్ల సంపద నష్టం జరగగా.. గురువారం మార్కెట్లలో కొనుగోళ్ల కోలాహలం తిరిగి స్టార్ట్ అయ్యింది. దీంతో ఉదంయ 10.15 గంటల సమయంలో సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 125 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 496 పాయింట్లు పెరిగాయి.

మార్కెట్లు వరుస నష్టాల నుంచి బుల్ జోరులోకి రావటంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో రియల్టీ షేర్లపై భారీగా డిమాండ్ కనిపించింది ఇన్వెస్టర్ల నుంచి. ఇదే క్రమంలో మెటల్స్, ఆటో రంగాలు కూడా కొనుగోళ్లతో పుంజుకున్నాయి. మార్కెట్ల దిశను లాభాల్లోకి మార్చిన కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్వెస్టర్ల వ్యాల్యూ బైయింగ్:

వరుసగా మూడు సెషన్ల పాటు అమ్మకాల ఒత్తిడి తర్వాత, పెట్టుబడిదారులు రియల్టీ, మెటల్ మరియు ఆటో రంగాల్లో తక్కువ ధరలకు లభిస్తున్న షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరాపై ఆందోళనలు ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లు నిలకడగా ఉండటంతో భారత మార్కెట్లు పుంజుకున్నాయి.

Source : V6 News

1 hour ago

Home Flash News