యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. గత 28 రోజులుగా భక్తులు స్వామివారి హుండీల్లో లో సమర్పించిన కానుకలను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండ కింద ఉన్న వ్రత మండప హాల్ లో కౌంట్ చేశారు. ఈ లెక్కింపులో 28 రోజులుగా హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి రూ.1,86,44,511 ఆదాయం సమకూరింది.
అదేవిధంగా 57 గ్రాముల బంగారం, 2 కిలోల 750 గ్రాముల వెండి సైతం సమకూరిందని ఈవో భవానీ శంకర్ తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం భక్తులు హుండీలలో భారీగా సమర్పించారు. అమెరికా 329 డాలర్లు, ఇంగ్లాండ్ 40 పౌండ్లు, కెనడా 160 డాలర్లు, యూరప్ 5, రియాల్ 3, ఆస్ట్రేలియా 30, ఇండోనేషియా 1000, సౌతాఫ్రికా 50, బ్రెజిల్ 5, మలేషియా 10, బెహ్రీన్ 1, హాంకాంగ్ 510, నేపాల్ 45 కరెన్సీ వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.