... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
గ్యాస్ కొరత..కట్టెలకు పెరిగిన డిమాండ్.. క్వింటాల్ కు రూ. 1500 నుంచి రూ. 2 వేలు

గ్యాస్ కొరత..కట్టెలకు పెరిగిన డిమాండ్.. క్వింటాల్ కు రూ. 1500 నుంచి రూ. 2 వేలు

దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో చాలా ఫంక్షన్లు, హోటళ్లు, హాస్టల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కట్టెల పొయ్యితోనే వంటలు వండుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కట్టెలకు భారీగా డిమాండ్ పెరిగింది . టింబర్ డిపోల దగ్గర కట్టెల కోసం జనం బారులు తీరారు. గత మూడు రోజుల క్రితం క్వింటాల్ కి రూ.1200 ఉంటే ఇప్పుడు రూ.1500 నుంచి 2 వేల వరకు అమ్ముతున్నారు.

హైదరాబాద్ లోని చాలా టింబర్ డిపోలకు భువనగిరి, ఆలేరు, జనగామ నుంచి కట్టెలు వస్తాయి. ఇక్కడి నుంచి ఫంక్షన్ హాల్స్ , హాస్టల్ , రెస్టారెంట్ల వారు కొనుగోలు చేస్తారు. ఉదయం 4 గంటల నుంచే కట్టెలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మొన్నటి వరకు తక్కువ ధరకు దొరికిన కట్టెలకు ఇపుడు డిమాండ్ పెరిగిందని ఎక్కువ రేటుకు కట్టెలు అమ్ముతున్నారని చెబుతున్నారు నిర్వాహకులు.

కట్టెల పొయ్యితో మెనూ తగ్గించాం. ఈరోజు బర్త్డే ఫంక్షన్ ఉండే సిలిండర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఫంక్షన్ హాల్ వాళ్ళు బయట కట్టలు కొనుగోలు చేయమని చెప్పారు. వంటలు వండేవారు కట్టెల పొయ్యి అయితే రాను అని చెప్తున్నారు. ఆరు ఏడు రకాల వంటలు పెడదామనుకున్నాను లేకపోవడం వల్ల వంటలు తగ్గించాను. కట్టెల పొయ్యి వల్ల లేటుగా వంటలు అవుతాయి కాబట్టి మెను తగ్గించాను . గ్యాస్ ఉంటే వంటలు తొందరగా అవుతాయి కట్టెల వల్ల లెట్ గా వంటలు అవుతాయి. కట్టలు అమ్మేవారు మొన్నటి వరకు చాలా తక్కువగా అమ్మవారు ఇప్పుడు ఎక్కువగా రేటు అమ్ముతున్నారు. అని క్యాటరింగ్ నిర్వాహకులు చెబుతున్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News