... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
సాగర్‌ డిఫెన్స్‌ పరిశ్రమ.. 25వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి: లోకేశ్‌

సాగర్‌ డిఫెన్స్‌ పరిశ్రమ.. 25వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి: లోకేశ్‌

నెల్లూరు: సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమ ఏపీకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. దీంతో స్థానిక మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమకు లోకేశ్‌ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పరిశ్రమ వల్ల 25 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.

జువ్వలదిన్నెలో అటానమస్‌ మారిటైమ్‌ షిప్‌యార్డును సాగర్‌ డిఫెన్స్‌ అభివృద్ధి చేయనుంది. మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 750 మందికిపైగా ఉద్యోగాలు కల్పించనుంది. ముంబయి కేంద్రంగా పనిచేసే సాగర్‌ డిఫెన్స్‌ సంస్థ.. అన్‌మాన్డ్‌ మెరైన్‌ సర్ఫేస్‌ వెహికల్స్‌ రంగంలోనూ పనిచేస్తోంది. ఇప్పటికే దేశ నౌకాదళం, ఐడెక్స్‌ (ఐడీఈఎక్స్‌), ఇతర భద్రతా సంస్థలతో పని చేస్తోంది. ఇక్కడ ఇంటెలిజెన్స్‌ మారిటైం సిస్టమ్స్, సెన్సార్లు, కమాండ్‌ కంట్రోల్‌ టెక్నాలజీలను అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో ఆధునిక నౌకా దళ కార్యకలాపాలకు ఈ షిప్‌యార్డు కీలకం కానుంది. (Andhra Pradesh News)

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News