... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
మార్చి 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

మార్చి 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్: మార్చి 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ సమావేశం (బీఎసీ)లో చర్చించి నిర్ణయించారు. 2026, మార్చి 16న 2026-27 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సభను స్పీకర్ మంగళవారానికి (మార్చి 17) వాయిదా వేశారు.

అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బిజినెస్ అడ్వైజరీ సమావేశం (బీఎసీ)లో చర్చించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్‎లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేపీ వివేకానంద, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కూనంనేని సాంబశివ రావు, కౌసర్ పాల్గొన్నారు.

సభను ఈ నెల 30 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది, రంజాన్, శ్రీరామ నవమితో పాటు ఆదివారం అసెంబ్లీకి సెలవు ఉండనుంది. మార్చి 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. 2026, మార్చి 20న భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది.

Source : V6 News

1 hour ago

Home Flash News