ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే : గవర్నర్ శుక్లా
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా. తన తొలి ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు గవర్నర్ శుక్లా. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ శుక్లా. తెలంగాణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారు గవర్నర్ శుక్లా. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నామని అన్నారు గవర్నర్ శుక్లా.
GHMCని మూడు కార్పొరేషన్లుగా మార్చామని.. హైదరాబాద్ అభివృద్ధి కోసమే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు శుక్లా.గ్లోబల్ సమ్మిట్ లో రూ. 5 లక్షల 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. వరంగల్, ఆదిలాబాద్ లో కొత్త ఎయిర్ పోర్టులు రానున్నాయని అన్నారు.
హిల్ట్ పాలసీతో పరిశ్రమల భూముల బదలాయింపు చేపట్టామని.. 55 కిలోమీటర్ల మేర మూసీని పునరుద్దరించబోతున్నామని అన్నారు గవర్నర్ శుక్లా. బులెట్ ట్రైన్స్ కు శంషాబాద్ కేంద్రం కానుందని అన్నారు. 2047 రైజింగ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు గవర్నర్ శుక్లా.