ఒకటిన్నర రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరాలి
ఈనాడు, అమరావతి: గృహావసర వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, గతంలో మాదిరే బుక్ చేసుకున్నాక ఒకటిన్నర రోజుల్లో ఇంటివద్దకే సిలిండర్ తెచ్చి ఇస్తే ప్రజల్లో ఆందోళనకు తావుండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వంటగ్యాస్ నిల్వలు, సరఫరాపై సోమవారం ఆయన ఆర్టీజీఎస్‌లో సమీక్షించారు. ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో 17,209 టన్నుల వంటగ్యాస్ నిల్వలు ఉన్నాయి. 1,154 ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోంది. ఓటీపీతోనే గృహావసర సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం. బుకింగ్ అయ్యాక సాధారణ రోజుల్లో ఒకటిన్నర రోజుల్లో గ్యాస్ సిలిండర్లు అందించేవారు.. ఇప్పుడు రెండున్నర రోజులు పడుతోంది. అన్న క్యాంటీన్లకు సంబంధించిన 17 సెంట్రల్ కిచెన్లకు గ్యాస్ ఇబ్బందులు లేవు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం త్వరలో ఎల్‌పీజీ కేటాయించనుంది’ అని తెలిపారు. చిరువ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా కిరోసిన్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశాలివి..