... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. ఖాతాల్లోకి నగదు జమ

Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. ఖాతాల్లోకి నగదు జమ

Andhra Pradesh News | అమరావతి: ఇమామ్‌లు, మౌజన్లకు రంజాన్ పండుగ వేళ కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారి గౌరవ వేతనం నిమిత్తం ప్రభుత్వం రూ.45 కోట్లను విడుదల చేసింది. గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను రంజాన్ పర్వదినం సందర్భంగా ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి నగదు నేరుగా జమ కానుంది. ఇందులో భాగంగా 5,000 మంది ఇమామ్‌లకు ఆరు నెలల వేతనం కింద రూ.30 కోట్లు, అలాగే మరో 5,000 మంది మౌజన్లకు ఆరు నెలల బకాయిల కింద రూ.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పండుగ పూట బకాయిలు విడుదల కావడంపై ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Source : ABP Desam

1 hour ago

Home Flash News