... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నాకు తప్పకుండా పదవి వస్తది..కష్టపడి పనిచేస్తుందెవరో అధిష్టానికి తెలుసు: రాజగోపాల్ రెడ్డి

నాకు తప్పకుండా పదవి వస్తది..కష్టపడి పనిచేస్తుందెవరో అధిష్టానికి తెలుసు: రాజగోపాల్ రెడ్డి

తనకు తప్పకుండా రాబోయే కాలంలో పదవి వస్తుందన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తుంది ఎవరో అధిష్టానానికి తెలుసన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే లక్కారంలోని ఎస్ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ‘చౌటుప్పల్ మున్సిపాలిటీ గెలుపులో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక నాయకునికి కార్యకర్తకి కృతజ్ఞతలు. ఓడిపోయిన అభ్యర్థులకు నా పూర్తి సహకారం ఉంటుంది. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దు. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు సహజం, అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

చౌటుప్పల్ ప్రాంతంలో భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, వాయ కాలుష్యం ఎక్కువవుతోంది. చౌటుప్పల్ పట్టణంలో అనధికారిక లెక్కల కంటే ఎక్కువగా లక్ష జనాభా ఉంది. ఈ జనాభాకి సరిపడా మౌలిక వసతులు కల్పించాలి. చౌటుప్పల్ ఔటర్ సమీపంలో ఉండడమే కాకుండా రీజినల్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రైలు కూడా వస్తుంది రాబోయే కాలంలో చౌటుప్పల్ కీలక ప్రాంతంగా మారనుంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక దూర దృష్టితో తీసుకున్న నిర్ణయం . కులాలతో రాజకీయం చేసేవారు కొంతకాలమే ఉంటారు కానీ మానవత్వంతో పని చేసే వారే ప్రజల్లో చెరగని ముద్ర వేస్తారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఎవరు కష్టపడుతున్నారో అధిష్టానానికి తెలుసు . ప్రజల్లో ఉండి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఎమ్మెల్యేలుగా చేయాలనేది నా ఆలోచన విధానం. తెలంగాణ రాజకీయాలలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తిపై ఉంది’ అని అన్నారు

Source : V6 News

1 hour ago

Home Flash News