తిరుమలలో హైటెక్ ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు
తిరుమల: తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను పరిశీలించారు. ల్యాబ్‌లోని పరికరాల పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. నీరు, ఆహార పదార్థాలు, ముడిసరకుల నాణ్యతను ఈ ప్రయోగశాలలో పరీక్షించనున్నారు. 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆధునిక యంత్రాలతో ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. తితిదే స్థలం కేటాయించగా.. కేంద్ర ప్రభుత్వ నిధులతో 9 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు.