... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నువ్వు నా ఫ్రెండ్ బాసూ.. హ్యాపీ నౌరూజ్ : ఇరాన్ కు విషెస్ చెప్పిన రష్యా పుతిన్

నువ్వు నా ఫ్రెండ్ బాసూ.. హ్యాపీ నౌరూజ్ : ఇరాన్ కు విషెస్ చెప్పిన రష్యా పుతిన్

యుద్ధం మూడో వారంలోకి వచ్చేసింది.. దేశాలకు దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్న సమయంలో రష్యా అతి పెద్ద బాంబ్ పేల్చింది. ఇరాన్ నూతన సంవత్సరం, పర్షియల్ కొత్త ఏడాది అయిన నౌరూజ్ సందర్భంగా.. ఇరాన్ దేశ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు చెప్పారు. శుభాకాంక్షలతోపాటు పుతిన్ ఇచ్చిన సందేశం.. ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేశాయి.

టెహ్రాన్ కు మాస్కో దవిశ్వసనీయమైన మిత్రుడు. నమ్మకమైన భాగస్వామి అంటూ కామెంట్ చేయటం సంచలనంగా మారింది. మామూలు రోజుల్లో ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయేది. ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది.

ఈ క్రమంలోనే ఇరాన్ దేశం.. ఇరాన్ నాయకులు రష్యాకు నమ్మకమైన, విశ్వసనీయమైన దేశం, మిత్రులు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పటం అంటే.. ఇరాన్ దేశానికి ఆర్థికంగా, ఆయుధ పరంగా రష్యా వెన్నుదన్నుగా నిలుస్తుంది అనటానికి ఇదే సాక్ష్యం అంటూ ప్రపంచ దేశాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇరాన్ దేశానికి రష్యా అండగా ఉంటుందని చెప్పటం ద్వారా.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ యుద్ధం ఎక్కువ రోజులే కొనసాగే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. ఇరాన్ దేశానికి ఆయుధ పరంగా.. టెక్నాలజీ పరంగా చైనా, రష్యా సపోర్ట్ చేస్తున్నాయనే వాదన చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు ఇరాన్ దేశ కొత్త ఏడాది నౌరూజ్ సందర్భంగా పుతిని శుభాకాంక్షలు చెప్పటంతోపాటు.. నమ్మకమైన, విశ్వసనీయమైన దోస్త్ అని సంబోధించటం చూస్తుంటే.. ఇరాన్ ప్రయోగించే ఆయుధాలు, మిస్సైల్స్, బాంబుల వెనక.. ఇరాన్ లక్ష్యాల వెనక రష్యా మద్దతు ఉన్నట్లే అని స్పష్టం అవుతుందని.. యుద్ధం చాలా రోజులు.. కొన్ని నెలలు కొనసాగే అవకాశం లేకపోలేదు అనేది పుతిన్ కామెంట్లతో తేలిపోయింది.

ఇప్పటి వరకు ఇరాన్ వెనక మాత్రమే ఉన్న రష్యా.. రేపు ఇరాన్ దేశానికి మద్దతుగా యుద్ధంలోకి దిగితే.. ఉక్రెయిన్ తో చేతులు కలిపి ఇప్పటికే రష్యాతో యుద్ధం చేస్తుంది అమెరికా. ఇలాంటి టైంలో ఇరాన్ పై యుద్ధానికి దిగిన అమెరికాకు.. పరోక్షంగా రష్యా మద్దతు ఇవ్వటం ద్వారా టిట్ ఫర్ టాట్ అంటున్నారు ఆర్థిక, అంతర్జాతీయ నిపుణులు.

Source : V6 News

1 hour ago

Home Flash News