... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఎంపీవోలుగా ఆరుగురికి ప్రమోషన్..

ఎంపీవోలుగా ఆరుగురికి ప్రమోషన్.. ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మల్టీ జోన్-–1 పరిధిలోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1, సీనియర్ అసిస్టెంట్ కేటగిరీలకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు మండల పంచాయతీ అధికారులుగా (ఎంపీవోలు) ప్రమోషన్ కల్పిస్తూ పీఆర్, ఆర్డీ కమిషనర్ డి.దివ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జోనల్ విధానం ప్రకారం 2019–-20, 2020–-21 ప్యానెల్ సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన రివ్యూ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టారు. గతంలో జరిగిన ఎంపీవో ప్రమోషన్లపై ఏర్పడిన సందేహాలు, కొత్త లోకల్ క్యాడర్ అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అంతర్గత కమిటీని నియమించింది. 

ఈ కమిటీ సమర్పించిన రిపోర్టును పరిశీలించిన డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ), నిబంధనల ప్రకారం అర్హులైనవారికి ప్రమోషన్లు ఖరారు చేసింది. నిజామాబాద్​జిల్లాలో గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీగా కొనసాగుతున్న ఏ.గంగాధర్, రజినీకాంత్ రెడ్డి, సయ్యద్​మగ్దమ్ అహ్మద్​ను మెదక్​ జిల్లాకు ఎంపీవోలుగా కేటాయించారు. నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పి.సాయిలును సిద్ధిపేట, సిద్ధిపేటలో గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న మునీరుద్దీన్​ను మెదక్​, వరంగల్​జిల్లాలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న షాజహాన్ ను ములుగుకు కేటాయించారు. ప్రమోషన్ పొందినవారు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా కొత్త జిల్లాలో విధుల్లో చేరాలని పంచాయతీరాజ్​శాఖ ఆదేశించింది.
ఈ నియామకాలను అడ్​హక్ ప్రాతిపదికన చేపట్టారు. కోర్టు కేసులు లేదా ఇతర పాలనాపరమైన నిర్ణయాలకు లోబడి ఈ ప్రమోషన్లు ఉంటాయని పేర్కొంది. ప్రమోషన్ పొందిన వారిని వెంటనే విధుల్లో నుంచి రిలీవ్ చేయాలని, వారు రిపోర్ట్ చేసిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.

Source : V6 News

1 hour ago

Home Flash News