Select Location
All Locations
State
Region
City / District
జగిత్యాలలో పండుగ వాతావరణం కనిపిస్తోంది: కేటీఆర్‌

జగిత్యాలలో పండుగ వాతావరణం కనిపిస్తోంది: కేటీఆర్‌

జగిత్యాల: జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. జీవన్‌రెడ్డిని కలిసిన అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌కు తెలిసిందే ప్రజలను కలవడమని అన్నారు. కేసీఆర్‌ ఇక్కడికి వస్తున్నారంటే.. సీఎం మేడిగడ్డ పోతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘ కోరుట్ల నుంచి రాకుండా ఇప్పుడు రోడ్డు తవ్వుతున్నారు. 

ఇన్ని రోజులు రోడ్డు గుర్తుకురాలేదు. గతంలో ఎన్నో బహిరంగసభలు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు కూడా సభ విజయవంతమవుతుంది’’ అని కేటీఆర్‌ అన్నారు. జగిత్యాలలోని వివేకానంద మినీ స్టేడియంలో ఈనెల 20న కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్‌ సమక్షంలో సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.ఈ క్రమంలో సభా ఏర్పాట్లను హరీశ్‌రావు, కేటీఆర్‌ పరిశీలించారు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News