Select Location
All Locations
State
Region
City / District
ఉప్పల్‌లో SRHకి అద్భుతమైన రికార్డు.. 8 ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవని CSK

ఉప్పల్‌లో SRHకి అద్భుతమైన రికార్డు.. 8 ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవని CSK

SRH, CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు (2026, ఏప్రిల్ 18న) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఒకే పొజిషన్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు టాప్–5లోకి రానుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో సీఎస్కేకి నిజమైన అగ్ని పరీక్షే అని చెప్పాలి.. ఎందుకంటే ఉప్పల్‌లో చెన్నైపై సన్‌రైజర్స్‌కి ఉన్న రికార్డు అలాంటిది మరీ. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన సీఎస్కే, ఉప్పల్‌లో మాత్రం జీరోనే అని చెప్పాలి.. గత 8 ఏళ్లలో ఈ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలే.. ఈ వేదికపై ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్ హైదరాబాదే గెలిచింది. దాంతో హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు జరిగగా, అందులో సీఎ్కకే 15 మ్యాచ్‌లలో విజయం సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 7 మ్యాచ్‌లలో విక్టరీ సాధించింది. గతేడాది ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో కూడా ఎస్ఆర్‌హెచే గెలిచింది. ఇక చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌లలో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ 3– 2తో అధిపత్యం ప్రదర్శించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్‌లలో 2 గెలిచి, మూడింట్లో ఓడిపోయింది. రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ గ్రాంఢ్ విక్టరీ సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా మూడు మ్యాచుల్లో ఓడి, రెండింట్లో గెలిచింది. చివరగా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి చెన్నై మంచి జోష్‌లో కనిపిస్తుంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది.


V6 News 1 hour ago
Home Flash News