ఎల్లుండి తెలంగాణ కేబినెట్ కీలక భేటీ..నిర్ణయాలపై ఉత్కంఠ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గల క్యాబినెట్ మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఒక అధికారిక నోట్ ద్వారా వెల్లడించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించేందుకు ఈ అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.