Select Location
All Locations
State
Region
City / District
బీఆర్ఎస్ ఉత్త కథలు చెబితే.. కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది : క‌ల్వ‌కుంట్ల కవిత

బీఆర్ఎస్ ఉత్త కథలు చెబితే.. కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది : క‌ల్వ‌కుంట్ల కవిత

ఈనెల 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామ‌ని.. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కవిత పిలుపునిచ్చారు ఈనెల 25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామ‌ని.. రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలిరావాలని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా పార్టీ ఆవిర్భావ‌ కార్యక్రమనికి వస్తున్నారు.. కొత్త రాజకీయ పరిణామం జరుగబోతోంది కాబట్టి.. పబ్లిసిటి మెటీరియల్ డిస్ట్రబ్ చేయొద్దని జీహెచ్ఎంసీని కోరారు. ఆర్టీసీ సమ్మెకు మా పూర్తి పద్ధతి మద్దతు ఉంటుంద‌ని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రంలో మక్కలు కొనే దిక్కు లేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.


Smacy News 1 day ago
Home Flash News