Select Location
All Locations
State
Region
City / District
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!

టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది. ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే..

కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ పెట్టుబడులు టెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్‌ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. 

ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి. తయారీ రంగంలో టెస్లా టెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


Sakshi 8 days ago
Home Flash News