Select Location
All Locations
State
Region
City / District
హైదరాబాద్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా రైతుల ఆందోళన

హైదరాబాద్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా రైతుల ఆందోళన

హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా రైతులు హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ధర్నా నిర్వహించారు. తమ నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ.. ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌ సంస్థ యజమాని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.2 వడ్డీ చెల్లిస్తామని చెప్పి భారీగా డబ్బులు సేకరించారని, ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు తీసుకున్నారని ఆరోపించారు. ఇలా 25 గ్రామాల్లోని 2,500 మంది రైతుల నుంచి రూ.250 కోట్లు వసూలు చేసినట్లు రైతులు చెబుతున్నారు.

అసలు, వడ్డీ ఏదీ చెల్లించకుండా వ్యాపారి ధనుంజయ్‌ గుప్తా మొహం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులంతా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయివారే. భూనిర్వాసితుల పరిహారం డబ్బును ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌ సంస్థ సేకరించింది. రైతుల ఫిర్యాదుతో ఫైనాన్స్‌ సంస్థ, ఆస్తులను పోలీసులు సీజ్‌ చేశారు. రైతులకు మాత్రం న్యాయం జరగకపోవడంతో వ్యాపారి ఇంటిముందు ధర్నా నిర్వహించారు.


Eenadu Telugu 8 days ago
Home Flash News