Select Location
All Locations
State
Region
City / District
అరబిందో రూ.800 కోట్ల బైబ్యాక్‌

అరబిందో రూ.800 కోట్ల బైబ్యాక్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా లిమిటెడ్‌ రూ.800 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్‌ ప్రతిపాదన 29న ముగియనున్నదని పేర్కొంది. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేర్‌కు రూ.1,475 చొప్పున 54,23,728 ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.800 కోట్ల నిధులు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. షేరు హోల్డర్లకు రాసిన లేఖలో..ఈ బైబ్యాక్‌ ప్రతిపాదనతో వాటాదారులకు ఆర్థిక లాభం చేకూరనున్నదన్నారు.


Smacy News 1 hour ago
Home Flash News