Select Location
All Locations
State
Region
City / District
అజారుద్దీన్‌, కోదండరాంలకు లైన్‌ క్లియర్‌

అజారుద్దీన్‌, కోదండరాంలకు లైన్‌ క్లియర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకులు అజారుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర పడింది. గవర్నర్‌ సంతకంతో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. కాగా, ఎమ్మెల్సీల విషయమై ఆగస్టు 30న ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది. దీంతో, తాజాగా ఫైల్‌పై గవర్నర్‌ సంతకం చేశారు.

నిన్నటి వరకు ఎలా ఉన్నానో ఎమ్మెల్సీగా కూడా అలాగే ఉంటానని తెలంగాణ జ‌న‌స‌మితి (టీజేఎస్‌) నాయ‌కుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. త‌న ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేసిన నేప‌థ్యంలో సాక్షి న్యూస్‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ''ఎమ్మెల్సీ ప‌ద‌వి గురించి ఆలోచించడమే మానేశాను. దాని గురించి ఎవరు అడిగినా సున్నితంగా ఆ విషయం వదిలేయమ‌న్నాను. పదవులు శాశ్వతం కాదని అర్థమైంది. నన్ను విమర్శించే వాళ్ళకి ఏం చెప్పలేను. నా ఎమ్మెల్సీని ఆపి కొందరు సంతోష పడ్డార''ని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.


Sakshi 1 day ago
Home Flash News