ఓటీటీలోకి ‘రాకాస’.. ఫాంటసీ కామెడీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇంటర్నెట్ డెస్క్: సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), నయన్ సారిక (Nayan Sarika), గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రాకాస’ (Rakasa). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. మే 1 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లాంటి వెబ్‌సిరీస్‌లకు రైటర్‌గా వర్క్ చేసిన మానస శర్మకు ఇదే తొలి సినిమా. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథేంటంటే?: తాను ప్రేమించిన అమ్మాయి కోసం వీరబాబు అలియాస్ వీరు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి ఎంతో హుషారుగా ఊరికి తిరిగొస్తాడు. అయితే అప్పటివరకూ తనని ఫోన్ కాల్స్‌లో కవ్విస్తూ, ముద్దు ముద్దుగా మాట్లాడిన ఆ అమ్మాయి మరొకరితో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని తెలుసుకుంటాడు.