ఒలింపియన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. శాయ్ కఠిన చర్యలు
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రోయింగ్ కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఓ ఒలింపియన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. కేరళ అలప్పుళలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒలింపియన్, ఆసియా గేమ్స్ పతక విజేత రోయర్ పీటీ పౌలోస్ (Olympian PT Paulose) కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో మహిళా అసిస్టెంట్ రోయింగ్ కోచ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం శాయ్ పీటీ పౌలోస్‌ను సస్పెండ్ చేసింది. 2025 ప్రారంభం నుంచి పీటీ పౌలోస్ తనకు అనుచితమైన సందేశాలు పంపేవాడని..
ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించేవాడని మహిళా కోచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా కఠినచర్యలు తీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. హెల్మెట్-బ్యాట్ విసిరికొట్టిన రఘువంశీ.. భారీ జరిమానా పౌలోస్ 2004 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ రోవర్‌గా నిలిచారు. 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో జెనిల్ కృష్ణన్, ఇందర్‌పాల్ సింగ్ రోషన్ లాల్‌లతో కలిసి కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. అనంతరం ఆయనను రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారత జట్టుకు హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా నియమించింది.