సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లు, పార్కింగ్ కోసం భూమి, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు విస్తరణ గురించి లేఖలో ప్రస్తావించారు. చర్లపల్లి స్టేషన్ దగ్గర రోడ్లు ఇరుకుగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వాటిని విస్తరించాలని కోరారు. పార్కింగ్ కోసం స్టేషన్ దగ్గర అదనంగా 5 ఎకరాల భూమి కావాలన్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా రోడ్లు ఇరుకుగా ఉన్నాయని.. విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం స్వయంగా వీటిపై దృష్టి సారించాలని కోరారు.