Select Location
All Locations
State
Region
City / District
ఒక్క నెలలోనే 33 వేల డ్రోన్లను కూల్చివేశాం : ఉక్రెయిన్‌‌ డిఫెన్స్‌‌ మినిస్ట్రీ

ఒక్క నెలలోనే 33 వేల డ్రోన్లను కూల్చివేశాం : ఉక్రెయిన్‌‌ డిఫెన్స్‌‌ మినిస్ట్రీ

కీవ్‌‌: రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశానికి చెందిన వేల సంఖ్యలో డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిల్‌‌ తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనే 33 వేలకు పైగా రష్యన్‌‌ డ్రోన్లను పేల్చేశామని ఉక్రెయిన్‌‌ డిఫెన్స్‌‌ మినిస్ట్రీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యా వైమానిక దాడులను అడ్డుకోవడానికి ఇంటర్‌‌‌‌సెప్టర్‌‌‌‌ డ్రోన్ల సరఫరాను పెంచుతున్నామని ఉక్రెయిన్‌‌ డిఫెన్స్‌‌ మినిస్టర్‌‌‌‌ మైఖైలో ఫెడోరోవ్ తెలిపారు. 2022 ఫిబ్రవరిలో రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తమ దాడి సామర్థ్యాలు పెరిగాయన్నారు.

అప్పుడు 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక లక్ష్యాలను మాత్రమే ఛేదించగలిగే వాళ్లమని, ఇప్పుడు దాదాపు 1,750 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై కూడా దాడి చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. రష్యన్‌‌ చమురు సంస్థలపై దాడి చేయడానికి ఈ సదూరు డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు.


V6 News 1 day ago
Home Flash News