Select Location
All Locations
State
Region
City / District
I-PAC Vinesh Chandel: ఐ-ప్యాక్ డైరెక్ట‌ర్ వినేశ్ చంద‌ల్‌కు బెయిల్ మంజూరీ

I-PAC Vinesh Chandel: ఐ-ప్యాక్ డైరెక్ట‌ర్ వినేశ్ చంద‌ల్‌కు బెయిల్ మంజూరీ

న్యూఢిల్లీ: ఐ-ప్యాక్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, డైరెక్ట‌ర్ వినేశ్ చంద‌ల్‌(I-PAC Vinesh Chandel)కు ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు మ‌నీల్యాండ‌రింగ్ కేసులో బెయిల్ మంజూరీ చేసింది. ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన బొగ్గు కుంభ‌కోణం కేసులో అత‌నికి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్‌ను ఈడీ అడ్డుకోలేద‌ని అద‌న‌పు సెష‌న్స్ జ‌డ్జి అమిత్ బ‌న్సాల్ తెలిపారు. 2 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు, స్యూరిటీ బాండ్‌పై వినేశ్‌ను రిలీజ చేశారు. ఈ కేసులో ఈడీ స్టేట్మెంట్‌ను కోర్టు రికార్డు చేసుకున్న‌ది. ద‌ర్యాప్తులో వినేశ్ స‌హ‌క‌రించిన‌ట్లు ఈడీ చెప్పింది. కోర్టు అనుమ‌తితోనే విదేశాల‌కు వెళ్లేందుకు ష‌ర‌తు విధించారు. ఆధారాల‌ను ధ్వంసం చేయ‌రాద‌న్న నిబంధ‌న కూడా పెట్టారు. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌న్నారు.

సీనియ‌ర్ అడ్వ‌కేట్ వికాశ్ ప‌హ్వా, అభిషేక్ మిశ్రాలు వినేశ్ త‌ర‌పున వాదించారు. ఏప్రిల్ 23వ తేదీన ఐప్యాక్ డైరెక్ట‌ర్‌ను 14 రోజుల పాటు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. బెంగాల్‌లో జ‌రిగిన బొగ్గు కుంభ‌కోణం కేసులో వినేశ్‌పై ఈడీ విచార‌ణ జ‌రుగుతున్న‌ది. భోపాల్‌లోని నేష‌న‌ల్ లా ఇన్స్‌టిట్యూట్ యూనివ‌ర్సిటీ లో వినేశ్ లా స‌బ్జెక్టులో గ్రాడ్యుయేష‌న్ చేశారు.ఐ-ప్యాక్‌లో అత‌నికి 33 శాతం షేర్ ఉన్న‌ది. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌ర‌పున అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఐ-ప్యాక్ ప్ర‌చారాన్ని నిర్వ‌హించింది.


Smacy News 1 day ago
Home Flash News